Sunday, April 12, 2020

Sabarimala Ayyappa temple Steps Behind Eighteen Steps 18 

Meaning behind the 18 stairs in the Ayyappa Swamy Temple ?




అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్ల వెనుక ఉన్న రహస్యం ఎంటి ?




శబరిమల అయ్యప్ప ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుని తరిస్తారు. ఏడాదికి ఏడాది శబరిమల భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 18 మెట్లు. ఆయన శ్లోకంలో కూడా 18 మెట్ల ప్రస్థావన ఉంటుం



అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే.. ఖచ్చితంగా 18 మెట్లు ఎక్కాల్సిందే. అది కూడా తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లుఎక్కితేనే ఆ అయ్యన్ అయ్యప్ప స్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. ఆలయ దర్శనానికి ముందు అనేక నియమాలు, పద్దతులు పాటించాలి. రోజులు దీక్ష తీసుకుని భక్తులు స్వామి దర్శనానికి వెళ్తారు.


ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు.
అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శలకు సంకేతం.
పంచేంద్రియాం : 
మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను, ఎప్పుడూ తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తాయి. అలాగే.. స్పర్శ జపమాల ద్వారా ఎప్పుడూ ఆ దైవనామస్మరణలో ఉండాలని తెలుపుతుంది.


తర్వాత 8 మెట్లు మెట్ల తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం,
లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దంబంనుసూచిస్తాయి.
అష్టరాగాలు : 
ఈ అష్టరాగాలను చక్కటి సందేశాన్ని ఇస్తాయి. మనుషులు అహంకారాన్ని విడనాడి, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి. చెడు మార్గంలో వెళ్తున్నవాళ్లకు మంచి మార్గంలో వెళ్లాలని సూచించాలి.


తర్వాత 3 మెట్లు 
తర్వాత మూడు మెట్లు సత్వం, తామసం
రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలు
బద్దకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి.


చివరి 2 మెట్లు
చివరి రెండు మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి
విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానం పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని విడవాలి అని తెలియజేస్తుంది. 


కొబ్బరికాయ : 
మెట్లు ఎక్కేటప్పుడు తలపై ఇరుముడి పెట్టుకోవాలి. ఈ ఇరుముడిని
దేవాలయంలో ఇచ్చి. ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

పరిపూర్ణత : 
శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కిన వాళ్లు జ్ఞానంతో పాటు సంపద
పొంది జీవితంలో పరిపూర్ణులవుతారని ఒక నమ్మకం ఉంది.